మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రత్యేక కథనం 16 d ago
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టిన వేళ ఆయన గురించి ప్రత్యేక కథనం. దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీ రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. జూలై 22, 1970న రోసీ నాగ్‌పూర్‌లోని ఝాలాలో దేవేంద్ర ఫడ్నవీస్ జన్మించారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ 22 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1997లో 27 ఏళ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన 2014లో మొదటిసారి మహారాష్ట్ర సీఎం అయ్యారు.
మొదటిసారి మహారాష్ట్ర సీఎం..
2014లో మొదటిసారిగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. శరద్ పవార్ తర్వాత మహారాష్ట్ర చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన రెండో సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు. 2014 నుంచి నవంబర్ 12, 2019 వరకు మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినా, సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేశారు. 2022 లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.మూడోసారి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి..
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. కూటమిలోని బీజేపీకి 132 సీట్లతో అధిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.